కావ్యావతారికలో....

    పాఠకునికి గ్రంథం యొక్క ప్రాథమిక సమాచారం, రచన నేపథ్యం, గ్రంథంలోని ముఖ్య విషయం, పరిస్థితులు సూక్ష్మంగా తెలుపునది "అవతారిక".  ఈ అవతారిక ను 'ముందుమాట' లేదా పీఠిక లేదా ఉపోద్ఘాతం లేదా భూమిక మొదలగు పేర్లతో పిలుస్తారు.  గ్రంథం ఏవిధంగా అవతరించింది తెలుపుటయే అవతారిక యొక్క ముఖ్య ఉద్దేశం.  ఈ అవతారిక సాంప్రదాయానికి ఆద్యులు నన్నయ్య.   కావ్యానికి వ్రాయబడిన అవతారిక లను కావ్యావతారికలు అంటారు. 

     కావ్య అవతారికల వల్ల ఈ విషయాలు తెలుసుకోవచ్చు

  • కృతికర్త - అతని కాలం - రచనలు - అతని వంశక్రమం
  • కృతి భర్త వివరాలు
  • కావ్యం యొక్క ఉద్దేశం
  • రచనా రీతులు-అభిప్రాయాలు
  • కావ్యంనాటి చారిత్రక విషయాలు
  • సుకవి-కుకవుల ప్రస్తావన
  • ఇతర కవులు ప్రస్తావన మొ"
  నన్నయ్య యొక్క భారత అవతారిక వల్ల అతని వ్యక్తిత్వం, కవితా లక్షణాలు తెలుస్తున్నాయి. 

    "సారమతింగవీంద్రులు ప్రసన్నకథా కవితాయుక్తిలో
     నారసిమేలునా నితరులక్షర రమ్యత నాధరింప నా
     నారుచిరార్ధ సూక్తినిధి నన్నయభట్టు తెనుంగునన్ 
    మహా
    భారత సంహిత రచన బంధు జగద్ధితంబుగన్

తన కవితా గుణాలు తెలుస్తున్నాయి.రచనకు సహాయపడిన నారాయణ భట్టు యొక్క రచన ప్రశస్తి తెలుస్తుంది నారాయణ భట్టుటు యొక్క బిరుదులు కరీభవజ్రరాంకుడు, సరస్వతి కర్ణావతంసుడు తమ్ముడు అష్టాదశ అవధాారణ చక్రవర్తి అనేవి ఉన్నట్లు తెలుస్తోంది.  

నన్నెచోడుడు తన కుమారసంభవం లో కవితా లక్షణాలను, కవిత్వం మదపుటేనుగు, సత్కవి యొక్క కావ్యం రత్న పుత్రిక వంటిదని అన్నట్లు తెలుస్తుంది.  నన్నెచోడుడు కావ్యావతారిిికలో కుకవి నింద మొట్టమొదటి సారిగా  ప్రవేశపెట్టాడు.

    " సరళముగాక భావములు జానుతెనుంగున నింపు పెంపుతో

     బిరిగొని  వర్ణనల్ ఫణితి పేర్కొన నర్థము..." అంటూ కవి కావ్య లక్షణాలను అవతారికలో తెలిపాడు.  

కుమారసంభవం కావ్య పీఠిక లో మార్గ దేశీ కవితలను ప్రస్తావించాడు

    " మును మార్గ కవితా లోకం

     బున వెలయగ దేశికవిత పుట్టించి తెనుం

     గున నిలిపిరంధ్ర విషయం 

     బున జనచాళుక్యరాజు మొదలుగ పలువుర్"


     తిక్కన కూడా నిర్వచనోత్త్తర రామాయణం అవతారికలో తన కవిత్వాభిప్రాయాలు తెలిపినట్లు తెలుస్తుంది.  తిక్కన తన మహాభారత రచనలు హరిహరనాథ తత్వం వివరించినట్టుగా అర్థమవుతుంది.  తిక్క ను " మహాకవిత్వ దీక్షానిధి నంది పద్యములు గద్యములన్ రచియించెదంగృతుల్" అని చెప్పుకున్నాడు.  మూలఘటిక కేతన తన దశకుమార చరిత్రలో తిక్కన గూర్చి ఉభయ కవి మిత్రుడు అని ప్రశంసించాడు.  తిక్కనకు దశకుమార చరిత్ర అంకితం ఇచ్చినట్లు, తిక్కన వద్ద వద్ద శిష్యుడిగా ఉన్నట్టు అవతారిక వల్ల తెలుస్తోంది.  శ్రీనాధుడి కాశీ ఖండంకావ్య అవతారికలో తన ఇతర రచనల ప్రస్తావన, తన పితామహుల గురించి ఉండి ఉంది.  కమలనాభ మాత్యుడు శ్రీనాథుడికి పితామహుడు అని అతను పద్మ పురాణం రచించినట్లు తెలుస్తోంది.  కాశీ ఖండం పీఠిక వలన  నన్నయ తిక్కన ల కంటే ముందుగా వేములవాడ భీమకవి అనే కవి ఉన్నట్టు తెలుస్తోంది. పోతన భాగవతం లోని అవతారిక యందు తాను నరాంకితం చేయనని రామాంకితం చేసినట్టుగా అవతారిక పేర్కొంటోంది.  కృష్ణదేవరాయల కి శ్రీకాకుళాంధ్ర విష్ణువు కలలో సాక్షాత్కరించి ఆముక్తమాల్యద అనే గ్రంథం రచిించమన్నట్లు అవతారిక తెలుపుతుంది. పిడమర్తి సోమన పద్య బసవ పురాణం అవతారిక వల్ల  పాల్కురికి సోమనాథని యొక్క కృతులు తెలుస్తున్నాయి.   అందులోనివి  కొన్ని అలభ్యం. 

     కొన్ని అవతారికలో వస్తు సూచన కూడా ఉంది. ధూర్జటి కాళహస్తి మహత్యం లోని మంగళాచరణము తో పాటు కథాసూచన కూడా చేయబడిందని అంటారు.  పింగళి సూరన రాసిన ధ్వర్థి కావ్యమైనా రాఘవ పాండవీయం లో ద్వర్థి కావ్యరచన ఎంత కష్టమో వివరించిన విధానం అవతారిక వల్ల తెలుసుకోవచ్చు.  "ఆంధ్రభాషా సంస్కృతాభిభాషా శ్లేష యొక్కక్క చోట నొక్కక్క చోటనుచిత శబ్ద శ్లేష...". అంటూ తన రచన ప్రణాళికని వివరించి ఏవిధంగా అర్థం చేసుకోవాలో తెలిపాడు. సంకుపాలనృసింహ కవి కవికర్ణ రసాయనం లో

   " నరగుణాంకితమయ్యేనేని సరసకృతియు

    దూష్యమగు శునిధృత గతదుగ్దుమట్లు"

అని రాజనింద చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ విధంగా అవతారికలో సాహిత్య సామాజిక చారిత్రక అంశాలతో కూడుకున్న ఉంటాయి. నన్నయ చూపించిన ఆ మార్గమే ఇప్పటికీ అనేక రకాల గ్రంథాల్లోని ముందుమాటగా స్థిరపడిందని చెప్పవచ్చు. కొన్ని కథా అవతారికలో కావ్య ప్రశస్తి తెలిపి కథా శ్రవణం వల్ల ఫలితం దక్కుతుందని పేర్కొన్నారు. సాహిత్య చరిత్రకు ఉపయోగకరంగా ఉండే ఈ అవతారిక కవికి, పాఠకునికి మధ్య వారధిలా పని చేస్తాయని చెప్పవచ్చు.


🙏🙏🌺🌼



    






Comments