చేమకూర "విలాసం"
ప్రబంధ యుగం అనంతరం సాహిత్యరంగంలోని కాలాన్ని దక్షిణాంధ్ర యుగం. ఈ దక్షిణాంధ్ర యుగం లో " అభినవ భోజుడు " గా పేరుగాంచిన రఘునాధ నాయకు ని కళానిలయానికి విజయ భవనము అనే పేరు ఉండేది. ఆ విజయ భవనములో ప్రఖ్యాత కవి చేమకూర వేంకటకవి . రఘునాథ నాయకుడు అంటే అమితమైన భక్తి విశ్వాసాలు గలవారు చేమకూర. చేమకూర తన రచనలను రఘునాథ నాయకుని కి అంకితం ఇచ్చాడని తెలుస్తుంది. అంతేకాకుండా కవి పండితుడు అయినా రఘునాధ నాయకునిచే ప్రశంసలు అందుకున్నాడు. "ప్రతి పద్యము నందు చమ త్కృతి గలుగంజెప్ప నేర్తు వెల్లెడ బెళుకౌ కృతి వింటి ముపారముగా క్షితిలో నీ మార్గమెవరికిన్ రాదు సుమీ" ప్రతి పద్యము నీలాగా చక్కని చమత్కారంతో చెప్పు నేర్పు ఈ భూమిపై ఎవరికీ రాదని రఘునాథ నాయకుడు అంతటివాడు చేమకూర వెంకటకవిని ప్రశంసించారు. చమత్కారాలతో చేమకూర వెంకటక వి ' విజయ విలాసం ', సారంగధర చర...