Posts

తెలుగు పద్యాలు....

      తెలుగు సాహిత్య విశిష్ట ప్రక్రియలలో పద్యం ఒకటి.  పద్యం ఛందోబద్ధమైనది.  లయాత్మకంగా గాన యోగ్యంగా ఉంటుంది.  ధారణకు అనువుగా ఉంటుంది.  అందుకే మన ప్రాచీన కవులు స్తుతులు, శాస్త్ర విషయాలు, నైతిక విషయాల్ని పద్యాల్లో చొప్పించి అందించారు.  పద్య ప్రక్రియలు 'శతకం' ఒక విభాగం.  మేలిమి ముత్యాలు లాంటి శతక పద్యాలు నుండి కొన్ని రసానుభూతిని ఆస్వాదిస్తూ నైతిక విలువల్ని పెంచుకునేలా ఉంటాయి.  పెద్ద వారి అనుభవాలు, చిన్న వారి జీవితాన్ని సుగమంగా,  సమర్ధవంతంగా తీర్చిదిద్దుకోవడానికి మార్గం చూపుతాయి. నాటి నన్నయ నుంచి నేటి వరకు ఈ పద్యాల యొక్క విశిష్టత ఎంతగానో ఉంది.  ఈ పద్యాలన్నీ శతక విభాగంలో వందగా కూర్చున్నప్పుడు అది శతకం అవుతుంది.  అన్ని పద్యాలు శతకం కాలేవు.   శతకమునకు ఈ క్రింది లక్షణాలు ఉండాలి. సంఖ్యా నియమము మకుట నియమము ఛందో నియమము  రసం నియమము ఆత్మాశ్రయ కవిత ధర్మము ముక్తక లక్షణాలు    తెలుగునాట 12వ శతాబ్దం లోనే శతక ప్రక్రియ జనించింది.  తెలుగులో శతక ప్రక్రియకి  ఆద్యుడు మల్లికార్జున పండితుడు.  అయితే సమగ్రర శతక...

కావ్యావతారికలో....

    పాఠకునికి గ్రంథం యొక్క ప్రాథమిక సమాచారం, రచన నేపథ్యం, గ్రంథంలోని ముఖ్య విషయం, పరిస్థితులు సూక్ష్మంగా తెలుపునది "అవతారిక".  ఈ అవతారిక ను ' ముందుమాట ' లేదా పీఠిక లేదా ఉపోద్ఘాతం లేదా భూమిక మొదలగు పేర్లతో పిలుస్తారు.  గ్రంథం ఏవిధంగా అవతరించింది తెలుపుటయే అవతారిక యొక్క ముఖ్య ఉద్దేశం.  ఈ అవతారిక సాంప్రదాయానికి ఆద్యులు నన్నయ్య.   కావ్యానికి వ్రాయబడిన అవతారిక లను కావ్యావతారికలు అంటారు.       కావ్య అవతారికల వల్ల ఈ విషయాలు తెలుసుకోవచ్చు కృతికర్త - అతని కాలం - రచనలు - అతని వంశక్రమం కృతి భర్త వివరాలు కావ్యం యొక్క ఉద్దేశం రచనా రీతులు-అభిప్రాయాలు కావ్యంనాటి చారిత్రక విషయాలు సుకవి-కుకవుల ప్రస్తావన ఇతర కవులు ప్రస్తావన మొ"   నన్నయ్య యొక్క భారత అవతారిక వల్ల అతని వ్యక్తిత్వం, కవితా లక్షణాలు తెలుస్తున్నాయి.      " సారమతింగవీంద్రులు ప్రసన్నకథా కవితాయుక్తి లో      నారసిమేలునా నితరు లక్షర రమ్యత నాధరింప నా      నారుచిరార్ధ సూక్తినిధి నన్నయభట్టు తెనుంగునన్      మహా     భారత ...

చేమకూర "విలాసం"

       ప్రబంధ యుగం అనంతరం సాహిత్యరంగంలోని కాలాన్ని దక్షిణాంధ్ర యుగం.  ఈ దక్షిణాంధ్ర యుగం లో " అభినవ భోజుడు "  గా పేరుగాంచిన రఘునాధ నాయకు ని కళానిలయానికి విజయ భవనము అనే పేరు ఉండేది. ఆ విజయ భవనములో ప్రఖ్యాత కవి చేమకూర వేంకటకవి .   రఘునాథ నాయకుడు అంటే అమితమైన భక్తి విశ్వాసాలు గలవారు చేమకూర.  చేమకూర తన రచనలను  రఘునాథ నాయకుని కి అంకితం ఇచ్చాడని తెలుస్తుంది.  అంతేకాకుండా కవి పండితుడు అయినా రఘునాధ నాయకునిచే ప్రశంసలు అందుకున్నాడు.           "ప్రతి పద్యము నందు చమ            త్కృతి గలుగంజెప్ప నేర్తు వెల్లెడ బెళుకౌ            కృతి వింటి ముపారముగా            క్షితిలో నీ మార్గమెవరికిన్ రాదు సుమీ"      ప్రతి పద్యము నీలాగా చక్కని చమత్కారంతో చెప్పు నేర్పు ఈ భూమిపై ఎవరికీ రాదని రఘునాథ నాయకుడు అంతటివాడు చేమకూర వెంకటకవిని ప్రశంసించారు.        చమత్కారాలతో చేమకూర వెంకటక వి ' విజయ విలాసం ', సారంగధర చర...

బద్దెన సు"మతీ"

      శతకములలో సుమతి శతకం తెలుగువారికి ఇలవేల్పు.  భాష సాహిత్యాలకు శైలికి, నడకకు, శబ్దాలంకారములకు, రీతి తత్వబోధనకు, బోధన విధానమునకు ప్రతీకగా నిలుచున్నది. తెలుగువారికి చాలా సన్నిహితమైన వాటిలో సుమతి శతకం ఒకటి.  సాహిత్యంలో అభిరుచులు మారిన సుమతి శతకం మాత్రం తరతరాలుగా మన వారిని అలరించి, నీతిని అందిస్తుంది.   ఈ సుమతి శతకాన్ని బద్దెన లేదా  బద్దె భూపాలుడు రచించాడు.  బద్దె భూపాలుడు "నీతిశాస్త్ర ముక్తావళి" అనే గ్రంథాన్ని కూడా రచించినట్టు తెలుస్తుంది. సుమతి శతకం కంద పద్యాలతో ఉంది.ఈయన 13వ శతాబ్దానికి చెందిన వాడు.  సి.పి.బ్రౌన్ వేమన పద్యాలు సేకరించిన తర్వాత ఈ పద్యాలు సేకరించాడు.  సుమతీ శతకం వేమన శతకం కన్నా ముందే రచింపబడింది.  తెలుగులో మొదటి నీతి శతకము  సుమతీ శతకం.  సుమతి శతకం పై పరిశోధన చేసిన వారిలో మచ్చ హరిదాసు గారు ముఖ్యులు.               "శ్రీరామునిదయచేతను             నారూఢిగా సకల జనులు నౌరాయనగా           ధారాళమైన నీతులు       ...

అలిశెట్టి..."సిటీలైఫ్"

      కళ ప్రజల కోసమే అని చివరివరకు నమ్మి, ఏనాడూ సంపాదనకై ఆరాటపడని  అక్షరం అలిశెట్టి ప్రభాకర్.  అక్షరాలకు ఆకలి బాధలను, కన్నీటి చుక్కలను, పేదరికపు ఆశలను చూపిన కవి.  అలిశెట్టి ప్రభాకర్ గారు కవిగానే కాదు చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్ గా ప్రఖ్యాతులు.  జగిత్యాలలో "సాహితీ మిత్ర దీప్తీ" సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించాడు. "పరిష్కారం" కవిత 1974లో  ఆంధ్ర సచిత్ర వారపత్రికలో అచ్చయిన మొదటి కవిత.  ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ల పాటు సీరియల్ గా "సిటీలైఫ్(1992)" ప్రచురించారు.      నగరంలోని మూలలను, మూలాలనూ కవి హృదయం ఎట్లా దర్శించిందో ఈ కవిత మన కళ్ళకు కట్టినట్లు గడుతుంది.  మనసు కిటికీ తెరిచి చూస్తే అక్షరాల వెనుక అనంత దృశ్యాలు కన్పిస్తాయి...       "నగారా మోగిందా        నయాగరా దుమికిందా       నాలుగు రోడ్ల కూడలిలో ఏమది?       అదే, నగరారణ్య హోరు       నరుడి జీవనఘోష       తల్లి ఒడివంటి       పల్లెసీమల్నొదిలి       తరలి...