తెలుగు పద్యాలు....
తెలుగు సాహిత్య విశిష్ట ప్రక్రియలలో పద్యం ఒకటి. పద్యం ఛందోబద్ధమైనది. లయాత్మకంగా గాన యోగ్యంగా ఉంటుంది. ధారణకు అనువుగా ఉంటుంది. అందుకే మన ప్రాచీన కవులు స్తుతులు, శాస్త్ర విషయాలు, నైతిక విషయాల్ని పద్యాల్లో చొప్పించి అందించారు. పద్య ప్రక్రియలు 'శతకం' ఒక విభాగం. మేలిమి ముత్యాలు లాంటి శతక పద్యాలు నుండి కొన్ని రసానుభూతిని ఆస్వాదిస్తూ నైతిక విలువల్ని పెంచుకునేలా ఉంటాయి. పెద్ద వారి అనుభవాలు, చిన్న వారి జీవితాన్ని సుగమంగా, సమర్ధవంతంగా తీర్చిదిద్దుకోవడానికి మార్గం చూపుతాయి. నాటి నన్నయ నుంచి నేటి వరకు ఈ పద్యాల యొక్క విశిష్టత ఎంతగానో ఉంది. ఈ పద్యాలన్నీ శతక విభాగంలో వందగా కూర్చున్నప్పుడు అది శతకం అవుతుంది. అన్ని పద్యాలు శతకం కాలేవు.
శతకమునకు ఈ క్రింది లక్షణాలు ఉండాలి.
- సంఖ్యా నియమము
- మకుట నియమము
- ఛందో నియమము
- రసం నియమము
- ఆత్మాశ్రయ కవిత ధర్మము
- ముక్తక లక్షణాలు
తెలుగు శతక సాహిత్యాన్ని వస్తువును బట్టి ఈ విధంగా వర్గీకరించవచ్చు.
- భక్తి శతకాలు
- నీతి శతకాలు
- శృంగార వైరాగ్య శతకాలు
- హాస్య శతకాలు
- దేశ భక్తి శతకాలు
- వేదాంత శతకాలు
- వ్యాజస్తుతి శతకాలు మొదలైనవి
కొన్ని నీతి శతకాలలోని పద్యాలు:
మ. సిరిలేకైన విభూషితుండె యయి భాసిల్లున్ బుద్ధుండౌదలన్
గురుపాదానతి కేలనీగి చెవులందు న్విన్కి వక్ర్తంబునన్
స్థిరసత్యోక్తి భుజంబులన్విజయమున్జిత్తం బునన్సన్మతో
హీరో సౌజన్యము గల్గిన న్సురభిమల్లా! నీతి వాచస్పతీ!
- ఎలకూచి బాల సరస్వతి
భావం: బృహస్పతి (వాచస్పతి) అంతటి వాడవయ్య ఓ సురభి మల్లా! శిరస్సు వంచి గురువుల పాదాలకు నమస్కరించేవాడు, దానగుణం కలిగిన వాడు, చెప్పి విషయాన్ని శ్రద్ధగా వినగలిగినవాడు, సత్యవ్రతుడు, భుజబలంతో విజయాలు పొందేవాడు, మనసునడా దయగల వాడైనా పండితుడు సంపద లేకుండా ప్రకాశిస్తాడు.
ఈ పద్యాన్ని ఎలకూచి బాల సరస్వతి మల్ల భూపాల యం లో రాసిన నీతిపద్యం. ధనం మూలం ఇదం జగత్ అన్న మాటల్లో పడి సత్ప్రవర్తనను వదిలి అక్రమ సంపాదనకు కు పాల్పడుతూ ఎవరినీ లెక్క చేయని దుర్బుద్ధి గలవాడు మనశ్శాంతిగా జీవించలేడు. సద్గుణం కలిగినటువంటి వాడే సంపదలు లేకపోయినా మనశ్శాంతితో బ్రతుకుతాడు అని ఎంతో చక్కగా పద్యం.
ఉ. బీదలకన్నవస్త్రములు పేర్మినొసంగుము తుచ్ఛసౌఖ్యసం
పాదనకై యబద్దముల బల్కకు, వాదములాడబోకు, మ
ర్యాదనతిక్రమింపకు, పరస్పర మైత్రి మెరుగు, మిట్టివౌ
వేదములంచెరుంగుము, వివేకధనంబిదినమ్ముచిత్తమా!
-శ్రీపతి పండితుడు. భావం: చిత్తమా! పేదవారికి అన్నముు వస్త్రాలు దానము చేయుము. నీచమైన సుఖాల కోసంం సంపాదన కోసం అబద్ధాలాడకు. ఎవరితోనూ అనవసరంగా వాదనకు దిగాడు. మర్యాదమీరి, ప్రవర్తించకు. ఇదేేేే వేద వాక్కులు గా భావించు. వివేకులకు ఇవే సంపదలు.
ఈ పద్యం పండిత త్రయం లో ఎక్కడైనా శ్రీపతి పండితుని వంశీయుడు గా పేరు పొందిన శ్రీపతి భాస్కర కవి రచించిన చిత్త శతకం లోనిది. సాటి మనిషికి సహాయ సహకారాలు అందిస్తూ సంపాదన కోసం విర్రవీగకు ఉండా సక్రమమైన మార్గంలో ఉంటూ హద్దులు మీరి ఎవరితోనూ వాదనగా ప్రవర్తించ కుండా ప్రతి ఒక్కరూ మెలిగితే ప్రపంచం శాంతమయంగా వర్ధిల్లుతుందని ఈ సూక్తులు వేదవాక్కు లని సత్ప్రవర్తన అసలైన సంపద అని శ్రీపతి భాస్కరుడు తెలియజేస్తున్నారు.
చ. మకర ముఖాంతరస్థ మగు మానికమున్ బెకలింప వ(బా
యక చలదూర్మి కానికరమైన మహోదధి దా(ట వచ్చు,మ
స్తకమున( బూవుదండ వలె సర్పము నైన భరింపవచ్చు,మ
చ్చిక ఘటియించి మూర్ఖజన చిత్తము( దెల్ప నసాధ్య మేరికిన్
భావం: ముసలి నోటిలోని రత్నములను బయటకు తీయవచ్చు. ఆగకుండా ఉప్పొంగుతుందిి కెరటాలతో నిండిన మహాసముద్రాన్ని కూడా దాటవచ్చు. తలపై పూలదండ వలె పాముని ధరించవచ్చు. కానీ ప్్ర్ర మనస్సుకు సాధ్యం.
Comments
Post a Comment